జనగాం: క్రీడాజ్యోతికి ఘనంగా స్వాగతం పలికిన క్రీడాకారులు

73చూసినవారు
జనగాం: క్రీడాజ్యోతికి ఘనంగా స్వాగతం పలికిన క్రీడాకారులు
జనగాం జిల్లా యువజన క్రీడల అధికారి ఆధ్వర్యంలో సీఎం కప్ క్రీడాజ్యోతి ర్యాలీకి ఘనంగా స్వాగతం పలికారు. హన్మకొండ నుండి బయలుదేరిన క్రీడాజ్యోతి ర్యాలీ బుధవారం జనగామ జిల్లాలోని యశ్వంతపూర్ ఎల్లమ్మ గుడి వద్ద ప్రవేశించిన సందర్భంగా క్రీడాకారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ ర్యాలీ జనగామ చౌరస్తా వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి క్రీడాకారులు, అభిమానులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్