భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య జనగామ జిల్లా కేంద్రంలో శుక్రవారం తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.
భారతదేశం ఆర్థిక సంక్షోభంలో కురుకుపోయే సమయంలో తన మేధాశక్తిని ఉపయోగించి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన గొప్ప నేత మన్మోహన్ సింగ్ అని అన్నారు. రాజ్యసభలో కూడా తెలంగాణ బిల్లు ఆమోదింపుకు మన్మోహన్ సింగ్ ముఖ్యపాత్ర పోషించారని అన్నారు.