అసెంబ్లీలో ప్రసంగించిన జనగామ ఎమ్మెల్యే

57చూసినవారు
దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ లో జనగామ నియోజకవర్గంలోనే ఎక్కువ భాగం వస్తుందని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ తమ ప్రాంతంలోని 484 చెరువులను నింపేందుకు సరైన వ్యవస్థ ఉందన్నారు. అన్ని పంపులను ఆన్ చేసి 484 చెరువుల్లో మెజార్టీ చెరువులను నింపి రైతుల పంట సాగుకు నీరు అందించవచ్చని చెప్పారు. ఈ మేరకు నీటిని అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత పోస్ట్