కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామానికి చెందిన తెలంగాణ సాంస్కృతిక సారధి కవి గాయకులు పిన్నింటి రత్నం రచనలో రెండు పాటలను రాష్ట్ర ప్రభుత్వం బాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ప్రగతి పథంలో ప్రజా పాలన పుస్తక సంకలనంలో చోటు దక్కింది. గురువారం కాంగ్రెస్ పార్టీ నాయకులు రత్నం ఇంటికి వచ్చి అభినందనలు తెలిపి, బియ్యం అందజేశారు. ఈ సందర్బంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారుల పాత్ర మరువలేనిదన్నారు.