జనగాం నియోజకవర్గ పరిధిలోని మద్దూరు మండలం మర్మాముల, బంజర గ్రామ రైతులు తెలంగాణ వ్యవసాయ శాఖ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డిని కలిసి వినతిపత్రాన్ని అందించారు. త్వరలో ప్రభుత్వం తీసుకురానున్న ఆర్ఓఆర్ చట్టంలో సాదా బైనమాలకు పట్టాలు ఇవ్వాలని, ఎన్నో ఏండ్లుగా సాదా కాగితాలతో కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు లేక ఇబ్బందులు పడుతున్నందున తగు న్యాయం చేయాలని వేడుకున్నారు.