ఈ దేశంలో అదాని, మోడీ, బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుంటే ప్రతీ పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని రాష్ట్ర మంత్రి, ఉమ్మడి వరంగల్ ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గురువారం ఆమె మాట్లాడుతూ అంబెడ్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే అంబెడ్కర్ ను అవమానించడమేనన్నారు. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.