కొమురవెల్లిలో మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్య క్రమానికి ఎస్ఎఫ్ఐ చేర్యాల డివిజన్ కార్యదర్శి తాడూరి భారత్ కుమార్ హాజరై జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థి ఉద్యమాల, పోరాటాల వేగుచుక్క ఎస్ఎఫ్ఐ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమురవెల్లి మండల నాయకులు తాడూరి ప్రకాష్, రాఘవ, చందు, భానుప్రసాద్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.