క్రషర్ మిల్లును తొలగించాలని డిమాండ్..

75చూసినవారు
క్రషర్ మిల్లును తొలగించాలని డిమాండ్..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం గూడూరు ప్రధాన రహదారిపై అర్పణ పల్లి గ్రామస్తులు మంగళవారం ఉదయం రాస్తారోకో చేపట్టారు. కేసముద్రం మండలంలోని అర్పణ పల్లి గ్రామ సమీపంలో నీ క్రషర్ మిల్లులో బ్లాస్టింగ్లు బాగా జరుగుతున్నాయని దానివల్ల ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి మిల్లును మూసివేయాలని దాని అనుమతులను రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :