కురవిలో ఆరవరోజుకు చేరుకున్న రైతుదీక్ష. అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలోని తట్టుపల్లి గ్రామానికి చెందిన దళితరైతు బేతమళ్ళ సహదేవ్ కురవి ఆలయం సెంటర్ లో చేపట్టిన రిలే నిరాహారదీక్ష శుక్రవారం ఆరవరోజుకు చేరుకుంది. పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు, రైతులు దీక్షాశిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు.