త్రాటిచెట్టు నుండి జారిపడి గీతకార్మికుడికి గాయాలు

786చూసినవారు
త్రాటిచెట్టు నుండి జారిపడి గీతకార్మికుడికి గాయాలు
మాహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని నందమూరి నగర్ కు చెందిన గీత కార్మికుడు చిర్ర వెంకన్న(40) గీతవృత్తిలో భాగంగా గురువారం త్రాటిచెట్టు ఎక్కుతుండగా మోకు జారి త్రాటిచెట్టు సగం నుండి జారి పడగా తీవ్రగాయాలు అవగా తోటి గీత కార్మికులు అతనిని ఏరియా ఆస్పత్రికి తరలించారు. కులవృత్తే ప్రత్యక్ష దైవంగా చాలీచాలని రాబడితో కుటుంబ పోషణ చేస్తున్న కడుబీద కుటుంబానికి చెందిన గీతకార్మికుడు చిర్ర వెంకన్న కు ప్రభుత్వం తరపున సహాయసహకారాలు అందించాలని తోటి గీత కార్మికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్