మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఎదళ్ళ పెళ్లి గ్రామానికి చెందిన ఎల్ది వీరన్న గౌడ్ గీత కార్మికుడు రోజువారి లాగానే ఆదివారం కూడా వాహనంపై తాడిచెట్ల వద్దకు వెళ్లిన వీరన్న తన చేతిలో ఉన్న కళ్ళు సీసాను ద్విచక్ర వాహనం సీటు పక్కన ఉన్న కొండికి తగిలిగిస్తుండగా సీటు కింద పాము కనిపించింది. భయాందోళనకు గురైన వీరన్న గ్రామానికి చేరుకొని సీటు తొలగించగా విష సర్పం బయటికి వచ్చింది. దీంతో అక్కడున్నవారు కర్రతో కొట్టి పామును చంపారు.