మహబూబాబాద్ జిల్లా కురవి మండలం బంచరాయి తండా గ్రామంలో శుక్రవారం సీఎం ఆర్ఎఫ్ చెక్కులను డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్రనాయక్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు లూనావత్ విజయ నాయక్, గ్రామ పార్టీ ఉపాధ్యక్షులు బానోతు సూర్య నాయక్, బంచరాయి తండా గ్రామ యూత్ అధ్యక్షులు లూనావత్ కృష్ణ నాయక్ మరియు పున్నం నాయక్ తదితరులు పాల్గొన్నారు.