మహబూబాబాద్ కలెక్టరేట్లో జిల్లా స్థాయి సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని గురువారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సహకార సంఘాల బలోపేతం ద్వారా ఆర్థిక పరిపుష్టి సాధించవచ్చని, ప్రభుత్వం సహకార సంఘాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత కల్పిస్తుందని తెలిపారు. జిల్లాలో కామన్ సర్వీస్ సెంటర్లను ప్రారంభించి సేవలను అందిస్తున్నట్లు తెలిపారు.