మహబూబాబాద్ పట్టణంలో ఆదివారం మొబైల్ టిఫిన్ వాహనంలో గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫైర్ ఇంజన్ వచ్చేసరికి మొబైల్ టిఫిన్ వాహనం, సామాను పూర్తిగా దగ్ధమయ్యాయి. తృటిలో ప్రాణాపాయం తప్పింది. వాహనం కాలిపోవడంతో టిఫిన్ సెంటర్ నిర్వాహకులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.