మహబూబాబాద్ లోని స్థానిక గుమ్మాడూరు మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను గురువారం ఆర్ బీ ఎస్ కే వైద్యబృందం సందర్శించి విద్యార్థులకు రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. చలి తీవ్రత అధికమౌతున్నందున జాగ్రత్తగా ఉండాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ డి. రాజేష్, హెల్త్ సూపర్వైజర్ శృతి పాల్గొనడం జరిగింది.