మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో జడ్పీ చైర్ పర్సన్ ఆంగోతు బిందు గురువారం హీరో ఎలక్ట్రిక్ బైక్ షోరూం ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ... ఈ రోజుల్లో పర్యావరణాన్ని రక్షించుకోవడం మన బాధ్యత అని, దానిలో భాగంగా వాహన కాలుష్యాన్ని నివారించుకోవడానికి పర్యావరణ కాలుష్య రహిత వాహనాలను వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో షోరూం యజమాన్యులు తౌటం సురేష్, బత్తిని రాజు, శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.