Jan 22, 2025, 18:01 IST/ములుగు
ములుగు
ఏటూరునాగారం: మైనర్లు డ్రైవింగ్ చేస్తే చర్యలు: ఎస్సై
Jan 22, 2025, 18:01 IST
మైనర్లు డ్రైవింగ్ చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఏటూరునాగారం ఎస్సై తాజుద్దీన్ హెచ్చరించారు. బుధవారం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ రోడ్డు భద్రతా మసోత్సావాల సందర్భంగా విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు త్రిబుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్ చేయకూడదన్నారు. వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్లు, డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్స్ కచ్చితంగా కలిగి ఉండాలన్నారు.