

ములుగు: ఆశ్రమ స్కూళ్లను కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తాం: మంత్రి
ఆశ్రమ స్కూళ్లను కాలేజీలుగా అప్ గ్రేడ్ చేస్తామని సోమవారం మంత్రి సీతక్క అన్నారు. అసెంబ్లీలో మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ములుగు జిల్లాలో జగ్గన్నపేట, తాడ్వాయి, మరికొన్ని ఆశ్రమ స్కూళ్లను కాలేజీలుగా అప్ గ్రేడ్ చేశామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని స్కూళ్లను కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ విద్యార్థులకు సోలార్ విద్యుత్ ద్వారా వేడినీరు అందించేందుకు కృషి చేస్తామన్నారు.