నాలుగు రోజులుగా అంగన్వాడీ టీచర్ల రిలే నిరాహార దీక్షలు

80చూసినవారు
నాలుగు రోజులుగా అంగన్వాడీ టీచర్ల రిలే నిరాహార దీక్షలు
ములుగు జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి నాలుగవ రోజుకు చేరుకున్నాయి. అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రెండు లక్షలు, ఆయాలకు లక్ష రూపాయలు, జీఓ నెంబర్ 10రద్దు చేయాలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతరం మంత్రి సీతక్కకు వినతి పత్రం అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్