బైక్ అదుపుతప్పి కిందపడ్డ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నూగూరు వెంకటాపురం మండలం వీరాపురం గ్రామం వద్ద గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ద్విచక్ర వాహనంపై ముగ్గురు ప్రయాణిస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు అదుపుతప్పి కింద పడింది. క్షతగాత్రులను వెంకటాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఇద్దరికీ తీవ్రగాయాలు కాగా మెరుగైన చికిత్స నిమిత్తం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు.