మేడారంలో వనదేవతల సన్నిధిలో భక్తుల సందడి

73చూసినవారు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మినీ జాతర సమీపిస్తున్న తరుణంలో సమ్మక్క, సారలమ్మ వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి వనదేవతలను దర్శించుకున్నారు. ఉదయం నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవార్లకు బంగారం(బెల్లం) సమర్పించి కోళ్లు, మేకలు బలిచ్చి, తమ మొక్కులను సమర్పిస్తున్నారు. దీంతో భక్తుల సందడి నెలకొంది.

సంబంధిత పోస్ట్