ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం దొడ్ల నుండి మల్యాల మధ్య జంపన్నవాగుపై వరదలకు బ్రిడ్జి కూలిన విషయం తెలిసిందే. రానున్న మేడారం మినీ జాతరకు ఈ దారి గుండా వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు అమ్మవార్ల దర్శనానికి వెళ్తుంటారు. కాగా ఇటీవల ఏర్పాటు చేసిన తాత్కాలిక మట్టిరోడ్డుపై రద్దీ పెరిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. రెండు వాహనాలు ఎదురెదురుగా ఒకేసారి వస్తే ముందుకు, వెనక్కు వెళ్లే పరిస్థితి లేదన్నారు.