బాలికల సంపూర్ణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని బాల సదనంను సోమవారం అదనపు కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనాధ బాలలు వసతి సౌకర్యం అవసరం ఉన్న బాలలు విద్యకు దూరమవుతున్న బాలికలను గుర్తించి బాలసదనంలో చేర్పించాలన్నారు. ప్రభుత్వం ఈ బాలసదనంలో అనేక రకాల సహాయాలను అందిస్తుందని తెలిపారు.