ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చూడాలి: ఎస్పీ శబరీష్

56చూసినవారు
ఫిర్యాదుదారులకు న్యాయం జరిగేలా చూడాలి: ఎస్పీ శబరీష్
పోలీసులు ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని ములుగు జిల్లా ఎస్పీ శబరిష్ మంగళవారం సూచించారు. ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన క్రైం సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. దొంగతనాలు, ఆర్థిక నేరాల్లో ఫిర్యాదు దారులకు న్యాయం జరిగేలా దర్యాప్తు చేయాలన్నారు. పోగొట్టుకున్న నగదు, వస్తువులను బాధితులకు అప్పగించేలా కృషి చేయాలన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్