దుర్గం గుట్టపై కాకతీయుల రాతి కట్టడాలు అద్భుతం: కలెక్టర్

63చూసినవారు
దుర్గం గుట్టపై కాకతీయుల రాతి కట్టడాలు అద్భుతం: కలెక్టర్
ములుగు జిల్లా గోవిందరావుపేట మండలంలో దట్టమైన అటవీప్రాంతం లోని దుర్గంగుట్టను శనివారం ములుగు కలెక్టర్ దివాకర్ జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ తో కలిసి సందర్శించారు. దుర్గంగుట్టపై భారీ రాతి కట్టడాలు అద్భుతంగా ఉన్నాయని, గుట్టను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలనీ కలెక్టర్ అన్నారు. దుర్గం గుట్ట చుట్టూపై భాగంలో రైలింగ్ ఏర్పాటు చేయాలని, చరిత్రను పర్యటకులకు వివరించేందుకు గైడ్ ను ఏర్పాటు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్