తాడ్వాయిలో ఘనంగా కొమురం భీం వర్ధంతి

50చూసినవారు
తాడ్వాయిలో ఘనంగా కొమురం భీం వర్ధంతి
ములుగు జిల్లా తాడ్వాయి మండలకేంద్రంలో కొమురం భీం 84వ వర్థంతిని బుధవారం ఆదివాసీ సంఘాలు ఘనంగా నిర్వహించాయి. తాడ్వాయి ఆర్టీసీ బస్టాండ్ వద్ద కొమురం భీం విగ్రహానికి ఆదివాసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆదివాసులు స్వయం పాలన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. భీం పోరాటం జల్ జంగిల్ జమీన్ ను రక్షించుకోవాలన్నారు. అనంతరం వెయ్యి మందితో భారీ ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్