మావోయిస్టులు నష్టపరిహారం చెల్లించాలని ధర్నా

64చూసినవారు
ములుగు జిల్లా వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో వంటచెరుకు కోసం వెళ్లిన ఏసు అనే వ్యక్తి మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ఇటీవల మృతి చెందాడు. ఏసు కుటుంబానికి మావోయిస్టు పార్టీ పెద్ద మొత్తంలో నష్టపరిహారం చెల్లించాలని సోమవారం జగన్నాధపురం వద్ద కుటుంబీకులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మావోయిస్టులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నష్టపరిహారం చెల్లించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :