ములుగు: రామప్ప దేవాలయానికి పెరిగిన భక్తుల రద్దీ

52చూసినవారు
ములుగు జిల్లా పాలంపేట రామలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక పౌర్ణమి కావడంతో శుక్రవారం ఉదయం నుండి దేవాలయానికి భక్తుల తాకిడి పెరిగింది. ప్రత్యేక పూజలు, అభిషేకాలతో రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుంటున్నారు. శివనామ స్మరణతో మారుమోగుతున్న రామప్ప ఆలయ ప్రాంగణం, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్