ములుగు: నకిలీ పాస్ పుస్తకాలు తయారు చేసిన వారు అరెస్టు

55చూసినవారు
ములుగు జిల్లాలో నకిలీ పాస్ పుస్తకాల తయారీ ముఠాలో కొందరు వ్యక్తుల ను అటవీ శాఖ అధికారులు గురువారం అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. వరంగల్ జిల్లా కు చెందిన చాందావత్ భద్రు, తాటిపాముల రాజు, భూక్య వెంకన్న, బానోతు హరికృష్ణ అనే నలుగురు నిందితుల అరెస్టు చేశారు. పరారీలో మరికొంతమంది నిందితులు ఉన్నట్లు తెలుస్తోంది. నిందితుల నుండి ల్యాప్ టాప్ ని స్వాధీనం చేసుకున్న ఫారెస్ట్ అధికారులు పూర్తి దర్యాప్తు నిమిత్తం కేసును పోలీస్ శాఖకు అప్పగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్