ములుగు జిల్లాలో పులి సంచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా అటవీశాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ సూచించారు. 2 రోజులుగా మంగపేట మండలంలోని గోదావరి, అటవీ ప్రాంతంలో పులి సంచారం నేపథ్యంలో పులి వెళ్లిన మార్గాన్ని పరిశీలించారు. చివరిసారిగా తిమ్మాపురం వద్ద పులి అడుగు జాడలను గుర్తించినట్లు రేంజర్ అశోక్ డిఎఫ్ఎకు తెలిపారు. పెద్దపులి సంచారంపై స్థానిక గ్రామాల ప్రజలు, రైతులకు అవగాహన కల్పించాలన్నారు.