ములుగు మండలం మల్లంపల్లిలో ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాల వసతి గృహం అధ్వానంగా మారింది. సరైన వసతులు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. సరైన కిటికీలు, తలుపులు లేకపోవడంతో చలికి వణుకుతున్నారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన గదుల్లోనే చదువు, లగేజీ, నిద్రపోవడం కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రీజర్లు కూడా లేకపోవడంతో చల్లటినీటితో స్నానం చేయాల్సి వస్తుందని వాపోతున్నారు.