చక్కటి ఆలోచన.. అడవిలో కంటైనర్ స్కూల్ ఏర్పాటు

73చూసినవారు
అది దట్టమైన అటవీ ప్రాంతం. భవన నిర్మాణానికి ఫారెస్ట్ ఆఫీసర్లు పర్మిషన్ ఇవ్వలేదు. దీంతో కలెక్టర్ వినూత్నంగా ఆలోచించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలోని బంగారుపల్లిలో కంటైనర్ ప్రభుత్వ పాఠశాలను సిద్ధం చేశారు. రూ.13 లక్షలతో 25 అడుగుల పొడవు, 25 అడుగుల వెడల్పుతో తయారు చేసి విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పించారు. ఈ పాఠశాలను మంత్రి సీతక్క మంగళవారం ప్రారంభించారు. తెలంగాణలో తొలి కంటైనర్ స్కూల్ కావడం విశేషం.

సంబంధిత పోస్ట్