ములుగు జిల్లా కేంద్రంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను నియంత్రించాలని, హింసకు గురవుతున్న హిందువులను రక్షించాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం విదేశాంగశాఖ తక్షణ చర్యలు తీసుకొని హిందువుల మనోభావాలను కాపాడాలని డిమాండ్ చేశారు. హైందవ ఆలయాలు, హిందూ ప్రజలను రక్షించాలని, తగిన న్యాయం చేయాలని అన్నారు.