నిందితుడిని కఠినంగా శిక్షించాలని ర్యాలీ

53చూసినవారు
ఏటూరునాగారంలో కోల్ కతాలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై జరిగిన అత్యాచారానికి నిరసనగా గురువారం వైద్యులు ర్యాలీ చేపట్టారు. వైద్యులు అభినవ్, ఉపేందర్ సింగ్ మాట్లాడుతూ నిందితుడిని కఠినంగా శిక్షించాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. మహిళల రక్షణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్నారు. అత్యాచారం జరిగి రోజులు గడుస్తున్నా నేటి వరకు చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్