ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట లో గల కాకతీయుల కాలంనాటి ప్రసిద్ధి చెందిన రామప్ప చెరువు మత్తడి ఎత్తును తగ్గించాలని బరిగలపల్లి, ఇంచర్ల, జంగాలపల్లి, బండారుపల్లి, పాల్ సాబ్ పల్లి, నర్సాపూర్, సింగరగుంటపల్లి, కేశవపూర్ గ్రామాల ప్రజలు శుక్రవారం ములుగు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ముంపు గ్రామాల్లో ప్రజలు నాయకులు మాట్లాడుతూ గత కొద్ది సంవత్సరాల నుండి కురుస్తున్న భారీ అతి భారీ వర్షాల వల్ల రామప్ప సరస్సులోకి భారీగా వర్ధని రుచేరడంతో తమ పంట పొలాలతో పాటు నివాస ప్రాంతాలు కూడా నీట మునుగుతున్నాయనివారు వినతి పత్రంలో పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల క్రితం కురిసిన అతి భారీ వర్షాలకు తమ గ్రామాలతో పాటు, ములుగు ఏటూరు నాగారం 163వ ప్రధాన రహదారి సైతం నీట మునిగిందని, ప్రస్తుతం కోస్తున్న వర్షాలకు రామప్ప సరస్సు పూర్తిగా నిండి నిండు కుండలో ఉందని రాబోయే రోజుల్లో భారీ వర్షాలు కురిసినట్లయితే గత పరిస్థితులు పునరావృత్తం అయ్యే అవకాశం ఉన్నందువల్లరామప్ప సరస్సు మత్తడి ఎత్తును తగ్గించి, మత్తడిని వెడల్పు చేయాలని వారు కలెక్టర్కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ముంపు గ్రామాల ప్రజలు నాయకులు పాల్గొన్నారు.