కొన్ని రోజులుగా ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు వ్యక్తిగత జీవితం, పెళ్లిపై వస్తున్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది. ఈ క్రమంలో 'కొందరు వ్యక్తులు, కొన్ని యూట్యూబ్ ఛానళ్లు తప్పుడు ప్రచారంతో గరికపాటి గౌరవానికి భంగం కలిగిస్తున్నారు. పారితోషికాలు, ఆస్తుల విషయంలో కూడా అసత్య ప్రచారం చేస్తున్నారు. అవన్నీ నిరాధారం. సత్యదూరం. సదరు వ్యక్తుల పై చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. పరువు నష్టం దావాలు వేస్తాం' అని పేర్కొంది.