బెంగళూరులోని కెనరా బ్యాంక్ ఒప్పంద ప్రాతిపదికన 60 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. ఏపీఐ మేనేజ్మెంట్, డేటాబేస్/ పీఎల్ ఎస్క్యూఎల్, క్లౌడ్ సెక్యూరిటీ, డేటా, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ విభాగాల్లో సంబంధిత డిగ్రీతో పాటు పీజీ, పని అనుభవం అవసరం. వయసు 35 ఏళ్లకు మించకూడదు. ఏడాదికి రూ.18-27 లక్షల వేతనం ఇస్తారు. ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్ https://canarabank.com/.