ములుగు జిల్లా కేంద్రంలోని జాతీయ రహదారిపై వర్షపునీరు భారీగా నిలిచింది. ములుగు జిల్లాకోర్టు ఎదురుగా డివైడర్ కు ఇరువైపులా భారీవర్షంతో వరదనీరు ప్రవహిస్తుండగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డివైడర్ ను పగలగొట్టి వరదనీరును అధికారులు క్లియర్ చేస్తున్నారు. అయినా 200 మీటర్ల మేర నీరు నిలవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. నాళాలను ఆక్రమించుకోవడంతోనే ఈ దుస్థితి నెలకొందని పేర్కొంటున్నారు.