భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం జాతర ప్రాంగణం

65చూసినవారు
ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల దర్శనానికి నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులు సమ్మక్క సారలమ్మలకు, పగిడిద్దరాజు, గోవిందరాజులకు పసుపు, కుంకుమ, బెల్లం, కొబ్బరి కాయలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. అనంతరం కోళ్లు, మేకలను బలి ఇచ్చి సమీప అడవిలో కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో విందులు చేసుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్