ములుగు జిల్లాలో ఇద్దరు అధికారులు బదిలీ అయ్యారు. ములుగు జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) మహేందర్ మహబూబాబాద్ కు, ములుగు ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి వరంగల్ కు బదిలీ అయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు జిల్లాలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శ్రీజ బదిలీ అయున తరువాత అదనపు కలెక్టర్ ను ప్రభుత్వం నియమించలేదు. మహబూబాబాద్ అదనపు కలెక్టర్ డేవిడ్, హన్మకొండ ఆర్డీఓ వెంకటేశ్ రానున్నారు.