ఉమ్మడి వరంగల్ జిల్లాలో పత్తి సాగు ఎక్కువ. పత్తి పంటను అధిక వర్షాలు కోలుకోలేని దెబ్బతీశాయి. 15 రోజులకుపైగా కురిసిన వానలకు మొక్కలు ఎర్రబారుతున్నాయి. కలుపుతీత భారంగా మారింది. సీజన్ ఆరంభంలో వర్షాలు కురవక ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ఒకవైపు కూలీల కొరత, మరొక వైపు అదనపు ఖర్చులు రైతులను కోలుకోలేకుండా చేస్తున్నాయి. పంట సరిగా పండక దిగుబడి కోల్పోయి నష్టపోయే అవకాశం ఉందని శుక్రవారం రైతులు ఆందోళన చెందుతున్నారు.