వెంకటాపూర్-పాలంపేటకు రాకపోకలు బంద్

64చూసినవారు
వెంకటాపూర్-పాలంపేటకు రాకపోకలు బంద్
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలోని సీడ్ ఫాం వద్ద బుధవారం మధ్యాహ్నం కురిసిన గాలి వానకు మర్రిచెట్టు కూలి రోడ్డుపై పడింది. దీంతో అటు వెళ్ళే దారి పూర్తిగా బ్లాక్ అయింది. దీంతో వెంకటాపూర్ మండల కేంద్రం నుండి పాలంపేటకు వెళ్లే వాహనాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ విషయం గురించి వెంకటాపూర్ పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు‌. పోలీసులు జెసిబి సాయంతో చెట్టును తొలగించే చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్