వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీలో బుధవారం వృద్దులకు ఇచ్చిన పెన్షన్ల నుంచి గ్రామపంచాయతీ అధికారులు ఇంటి, నల్లా పన్నులు వసూలు చేశారు. పండగ పూట డబ్బులు వృద్ధులకు ఇచ్చిన పెన్షన్లో కోత విధించడం ఏంటని వారు ఆవేధన వ్యక్తం చేశారు. ఇంకా మూడు నెలలు సమయమున్నా ఇప్పుడే పన్నులు వసూలు చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమ కొడుకుల దగ్గర వసూలు చేసుకోమని విన్నవించినా వినలేదన్నారు.