షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధం

50చూసినవారు
వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో శుక్రవారం రాయరాకుల సతీష్ అనే వ్యక్తి ఇంట్లో బట్టలు ఇస్త్రీ చేసే ఐరన్ బాక్స్ వల్ల ప్రమాదం జరిగి ఇంట్లో వస్తువులు కాలిపోయాయి. ఉదయం ఇస్త్రీ చేసి కరెంట్ పోవడంతో స్విచ్ బంద్ చేయకుండా ఫంక్షన్ కు వెళ్లారు. కరెంటు రావడంతో ఇస్త్రీ పెట్టె బాగా వేడి కావడంతో బట్టలు అంటుకున్నాయి. దీంతో ఇంట్లో వస్తువులు కాలిపోయాయి. చుట్టు పక్కల వారు ఫైర్ సిబ్బంది కి సమాచారం అందించడంతో
ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్