వారణాసి లోని కాశీ విశ్వేశ్వర స్వామి ని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ్ రెడ్డి కుటుంబ సమేతంగ శనివారం తెల్లవారుజామున దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా లింగార్చన పూజ సతీసమేతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజక వర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుణ్ణి కోరినట్లు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు.