వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సంచరించిన పెద్దపులి కొత్తగూడ అడవుల్లోకి వెళ్లిందని నర్సంపేట ఎఫ్అర్ఓ రవికిరణ్ తెలిపారు. గత మూడు రోజులుగా మండల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన పెద్దపులి నల్లబెల్లి నుంచి నర్సంపేట మండలం మీదుగా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ అడవుల్లోకి వెళ్లిందని ఆయన తెలిపారు. ప్రజలు భయభ్రాంతులకు లోనుకాకుండా తమ పనులు నిర్భయంగా చేసుకోవాలని తెలిపారు.