మరిపెడ మండలం పురుషోత్తమయగూడెం బ్రిడ్జిపై వరద ప్రవాహంలో కొట్టుకపోయిన అశ్విని మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా సింగరేణి మండలం గంగారాం తండాకు చెందిన అశ్విని చదువుల్లో మేటి అగ్రికల్చర్ బీఎస్సీలో గోల్డ్ మెడలిస్ట్ రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పీహెచ్డ్ చేస్తూనే జాతీయ స్థాయిలో అగ్రికల్చరల్ రీసెర్చ్ సైంటిస్ట్ గా ఎంపికైంది. అశ్విని మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.