ఆస్పత్రిని పరిశీలించిన కేంద్ర బృందం

56చూసినవారు
ఆస్పత్రిని పరిశీలించిన కేంద్ర బృందం
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం, పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని శుక్రవారం కేంద్ర వైద్య శాఖ అధికారుల బృందం సందర్శించారు. ఆసుపత్రిలోని ఎంసీఏహెచ్, ఓటీ, ఎన్సీడీ, డయాలసిస్, పిడియాట్రిక్ విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కేంద్ర అధికారులు వరుణ్ విజయ్, తేజ్ కిరణ్ రెడ్డి, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్