గత రెండు రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాను ఉదయం పొగ మంచు కమ్మేస్తుంది. మరో వైపు చలి వణికిస్తోంది. దీంతో పొలం పనులకు వెళ్లేవారు, విద్యార్థులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో బుధవారం ఉదయం పొగమంచు పూర్తి గా కమ్మేసింది. ప్రధాన రహదారిపై తీవ్రంగా పొగమంచు కురుస్తుండటంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ప్రయాణం జాగ్రత్తగా చేయాలని అధికారులు సూచిస్తున్నారు.