పుల్వామా అమరవీరులకు నివాళులు

588చూసినవారు
పుల్వామా అమరవీరులకు నివాళులు
మండల కేంద్రంలోని వివిధ సంఘాల ఆధ్వర్యంలో కార్గిల్ అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించారు ఫిబ్రవరి 14న కార్గిల్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకునే సందర్భంగా మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో వివిధ సంఘాల నాయకులు దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల స్మరిస్తూ నినాదాలు చేశారు. అనంతరం వారికి ఘన నివాళులు అర్పించి ఆ మహనీయులకు ఆత్మ శాంతి కలగాలని రెండు నిమిషాల మౌనం పాటించారు. అందరికీ అన్నం పెట్టే అన్నదాతలను స్మరిస్తూ అదేవిధంగా పోరాడే జవాన్లను కీర్తించారు జై జవాన్ జై కిసాన్ నినాదంతో అమరవీరులను స్మరించారు. ఈ కార్యక్రమంలో అణగారిన వర్గాల ఐక్యవేదిక వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు పరికి కోరనల్. తెలంగాణ దళిత విద్యావంతుల వేదిక జిల్లా కార్యదర్శి బట్టు సాంబయ్య. వికలాంగుల హక్కుల పోరాట సమితి మండల అధ్యక్షుడు పులి రమేష్ గౌడ్. టిఆర్ఎస్ పార్టీ అనుబంధ బీసీ సంఘం నాయకుడు సింగరబోయిన కటయ్య. నల్లబెల్లి మాజీ ఉపసర్పంచ్ కొత్తగట్టు ప్రభాకర్. గ్రామపంచాయతీ సిబ్బంది. పులి చక్రపాణి. కామ గోని దిలీప్. తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్